Skip to main content

అసలైన విజయం ఏది?

 నేటి జీవిత సత్యం. అసలైన విజయం ఏది? 

         


     


 *ఎత్తైన పర్వత శిఖరాన్ని అధిరోహించిన వ్యక్తి అదే విజయమనుకుంటాడు. తనకు వచ్చిన ఆటలో అత్యుత్తమ ప్రతిభ కనబరచి పతకాలను పొందిన ఆటగాడికి విజయమంటే అదే.*


*నిద్రాహారాలకు దూరమై ప్రయోగాలు చేస్తూ ప్రజలకు అనేక ఆవిష్కరణలు అందించే శాస్త్రవేత్తకు తాను సాధించిందే విజయం.*


*చిక్కక పాదరసంలా జారిపోయే భావాలను ఒడిసిపట్టి చక్కని భాషలో వ్యక్తీకరించిన వేళ రచయితకు ఎనలేని సంతోషం. అతడి భావనలో అదే విజయం.*


*విజయం అనే మాట సాపేక్షమైనది. జీవితంలో విజయం సాధించడమంటే కొందరు వారి భావనలో ఉండే గొప్ప కార్యాలను చేయడమని వాదిస్తారు. వాస్తవానికి వారు చేసిన పనులు విజయాలే కాని విజయమంటే అదేకాదు. మనిషి ఆర్థిక, సామాజిక, మానసిక, ఆలోచనా తీరులతోపాటు అతడి జీవిత నేపథ్యంమీద ఆధారపడి విజయభావన వ్యక్తమవుతూ ఉంటుంది. జీవితంలో ఉండే అనేక అంశాలు, వాటి ప్రాధాన్యాన్ని బట్టి, వ్యక్తుల అభిరుచిని బట్టి వారి ప్రతిభా వ్యుత్పత్తుల ఆధారంగా వారు సాధించే ఘనకార్యాలే విజయాలు.*


*నవమాసాలు మోసి పండంటి బిడ్డకు జన్మనిచ్చిన తల్లికి ఆ బిడ్డ ఎదుగుదల ముఖ్యం. మెడ నిలబెట్టవలసిన సమయంలో నిలబెట్టడం, నడవాల్సినప్పుడు నడవడం, మనుషుల్ని గుర్తుపట్టడం... ఇలా      ఏ తరుణంలో చేయవలసిన పనులు అప్పుడు చేస్తూ ఆరోగ్యంగా ఎదిగే బిడ్డను చూస్తే తల్లికి పట్టరాని ఆనందం.  ఆ ఆనందమే ఆమెకు విజయమంటే.*


*రైతు పొలాన్ని దున్ని, విత్తనాలు చల్లి, నీటి వసతి ఏర్పరచి బిడ్డలా సంరక్షిస్తూ పోషణ చేస్తాడు. పంట చేతికి చిక్కినవేళ రైతుకది ఓ ఘనవిజయమే.*


*వైద్యుడు దేవునితో సమానం. రోగులకు వైద్యం అందించి వారిని స్వస్థులను చేస్తాడు. ఒక్కొక్కసారి శస్త్రచికిత్స అవసరమవుతుంది. ఎంతో క్లిష్టతతో కూడినదై, రోగి ప్రాణానికి ముప్పు తేవచ్చన్న సందర్భంలో సాహసించి              ఆ శస్త్రచికిత్సను వైద్యుడు చేస్తాడు. కృతకృత్యుడైన వేళ అది ఓ అద్భుత విజయమే!*


*రెక్కాడితేగాని డొక్కాడని శ్రమజీవులెందరో ఉన్నారు. రెక్కలు, ముక్కలు చేసుకుని వచ్చిన ఆ కూలి డబ్బుతో బిడ్డ నోటికి ముద్దనందించిన వేళ ఆ తల్లికది గొప్ప విజయమే.*


*దేనిలోనైనా ఒక నైపుణ్యం, పరిణతి పొందడానికి సాధన అవసరం. నిర్ణీత సమయంలో చదువు పూర్తిచేసుకోవాలి, ఉద్యోగాన్ని సంపాదించుకుని ఆర్థిక భద్రతకు దారిని ఏర్పరచుకోవాలి. గృహస్థాశ్రమ జీవితాన్ని ధర్మబద్ధంగా గడిపి, బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలి. ఇవీ విజయాలే.*


*నైతిక ప్రవర్తనతో, ధర్మబద్ధతతో, నిజాయతీ నిబద్ధతలతో జీవించాలి. అప్పుడే మన జీవితానికి ఒక విలువ, గౌరవం ఒనగూడుతాయి. ఈ రకమైన ప్రవర్తన మన జీవితాన్ని మెరుగుపరుస్తుంది. అనేకమంది మనమంటే అభిమానించేటట్లు చేస్తుంది. ఇదీ విజయమే!*


*మనిషి ఒక ఉపాధ్యాయుడో, వైద్యుడో, శాస్త్రవేత్తో, రచయితో, సంగీతకారుడో... ఎవరైనా కావచ్ఛు కాని తాను మానవుడినన్న విషయం మరువకూడదు. తనలోని ప్రేమ, జాలి, కరుణ, నిజాయతీ, ధైర్యస్థైర్యాలు మొదలైన మానవీయ లక్షణాలను వికసింపజేయాలి. అప్పుడే మహనీయుడవుతాడు. అది అన్నింటికంటే అద్భుత విజయం, అసలైన విజయం.



Comments

Popular posts from this blog

HIGHEST MARKS IN CA FINAL(ALL TIME HIGHEST MARKS IN INDIVIDUAL SUBJECTS)

  “ There are some people who lead, set benchmarks and inspire others” The highest score in CA Final aggregate wise being the highest total number of marks obtained in a CA Final Examination till date is  630/800  by the topper of the examination held in May 2017. The subject wise highest scores have been obtained by different individuals in their respective examinations spread over a period of time. The subject wise highest scores can be illustrated as follows :- FR- 98/100 SFM- 100/100 AUDIT- 83/100 LAW- 88/100 AMA- 92/100 ISCA- 98/100 DT- 94/100 IDT- 91/100 Some of these papers have been preserved as a symbol of excellence in the ICAI Hall of Fame. ( The scores mentioned above are reproduced to the best of my knowledge and ability. Changes if any, can be suggested for edits)

Finance Rules You Should Know

  *Nine Personal Finance Rules we all must know* 1) Rule of 72 (Double Your Money) 2) Rule of 70 (Inflation) 3) 4% Withdrawal Rule 4) 100 Minus Age Rule 5) 10, 5, 3 Rule 6) 50-30-20 Rule 7) 3X Emergency Rule 8) 40% EMI Rule 9) Life Insurance Rule 1) *Rule of 72* No. of yrs required to double your money at a given rate, U just divide 72 by interest rate Eg, if you want to know how long it will take to double your money at 8% interest, divide 72 by 8 and get 9 years. At 6% rate, it will take 12 years At 9% rate, it will take 8 years 2) *Rule of 70* Divide 70 by current inflation rate to know how fast the value of your investment will get reduced to half its present value. Inflation rate of 7% will reduce the value of your money to half in 10 years. 3) *4% Rule for Financial Freedom* Corpus Required = 25 times of your estimated Annual Expenses. Eg- if your annual expense after 50 years of age is 500,000 and you wish to take VRS then corpus with you required is 1.2...

GUIDE TO FORM 3CB AND 3CD (TAX AUDIT)

  Income Tax rules necessitate few taxpayers to get their accounts audited under Section 44AB. The threshold limit of Rs 1 crore for a tax audit is proposed to be increased to Rs 5 crore with effect from AY 2021-22 (FY 2020-21) if the taxpayer’s cash receipts are limited to 5% of the gross receipts or turnover, and if the taxpayer’s cash payments are limited to 5% of the aggregate payments. The auditor has to furnish the audit report in the specified audit form along with the detailed particulars Prescribed Audit Forms The audit report has to be furnished in either of the following forms: Form 3CA  – In respect of a taxpayer carrying on a business or profession and who is already  mandated  to get his accounts audited under any other law  (i.e. law other than income tax law) . A company is required to get its accounts audited compulsorily under Companies Act 2013. So, it will furnish Form 3CA.    Form 3CB  – In respect of a taxpayer carrying on a ...