రామాయణం ఎందుకు చదవాలి నిజమే, రామాయణం ఎందుకు చదవాలి? ఎప్పుడో త్రేతాయుగం నాటి కథ. వందల పేజీల గ్రంథం. అదే సమయంలో ఏ వ్యక్తిత్వ వికాస పుస్తకమో చది వితే, ఎంతోకొంత స్ఫూర్తి కలుగుతుంది. ఏ నెట్ లో సినిమా చూస్తే చక్కని కాలక్షేపం లభిస్తుంది. ఏ ఆఫీసుపనో చేసుకుంటే బాసు ప్రశంసా అందుతుంది. కానీ, ఈ ప్రయోజనాలన్నీ తాత్కా లికం. రామాయణానికి నిన్ను పరిపూర్ణ వ్యక్తిగా మార్చే శక్తి ఉంది. ఆ స్ఫూర్తి పదాడంబర వికాస పుస్తకంలా పక్షానికో, పున్నానికో పరిమితం కాదు. జీవితాంతం వెన్నంటి నిలుస్తుంది. ఇక,చిన్నచిన్న కష్టాలకే ఆత్మహత్య ఆలోచనలు రావు. ఒకటి రెండు అపోహలతోనే బంధాలు బీటలువారవు. ఆస్తిపాస్తుల కోసం అన్నదమ్ములతో తగువు పెట్టుకోం. దశరథ పుత్రుడైన రాముడు ఎన్ని కష్టాలు అనుభవిం చాడూ? ఎన్ని పరీక్షలు ఎదుర్కొన్నాడు ? రాజ్యాన్ని కోల్పోయాడు, తండ్రిని కోల్పోయాడు. భార్య దూరమైంది, ఓ దశలో సోదరుడూ ప్రాణాపాయంలో పడ్డాడు. అయినా, ధైర్యాన్ని వీడలేదు. ఓటమిని అంగీకరించలేదు. వానర సైన్యాన్ని కూడ గట్టుకున్నాడు. సముద్రాన్ని దాటి లంకకు చేరుకున్నాడు. మహా శక్తిమంతుడైన రావణుడితో యుద్ధం చేశాడు. గెలిచాడు. ప్ర...